26 June, 2026 | 8:18 PM

సిద్దిపేట జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నత్తి శివకుమార్

26-06-2026 06:53 PM

గజ్వేల్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నత్తి శివకుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నత్తి శివకుమార్ మాట్లాడుతూ ఆయన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ఎస్సీ వర్గాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  ప్రజా ఉద్యమాలు చేపట్టి జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నత్తి శివకుమార్ పేర్కొన్నారు.