14 April, 2026 | 3:38 PM

బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి: మంత్రి పొంగులేటి

14-04-2026 11:11 AM

కల్లూరు,(విజయ క్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(AmbedkarJayanti) ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌ , జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్,  స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు,  స్థానిక ప్రజలు పాల్గొన్నారు.