2 July, 2026 | 10:51 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి

15-04-2026 11:09 AM

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తామని, ఆర్కియాలజీ విభాగం(Department of Archaeology) సమన్వయంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల వద్ద మెరుగైన మౌలిక వసతులను కలిపిస్తామని తెలిపారు. నగరంలోని కుతుబ్‌షాహీ టూంబ్స్, కటోరా హౌస్, చార్మినార్ ప్రాంతాలను పరిశీలించి, వారసత్వ సంపద పరిరక్షణ, పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.