05-02-2026 12:41:54 PM
కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మంత్రి జూపల్లి షాకింగ్ సవాల్.
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) వినూత్న వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ గుర్తులపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ సైకిళ్లు తెచ్చుకుంటేనే తాను ఎన్నికల ప్రచారానికి వస్తానని స్పష్టం చేశారు. సైకిళ్లపైనే ప్రచారం చేస్తే ఆరోగ్యం మెరుగుపడటమే కాక ప్రజల్లో వ్యాయామంపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గురువారం 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పెబ్బేటి శేఖర్‌కు మద్దతుగా ప్రజలను ఆశీర్వదించాలని కోరారు.