సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
మెదక్, మార్చి 16(విజయ క్రాంతి) :సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు నిర్ణయించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని TSUTF జిల్లా అధ్యక్షులు పద్మారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TSUTF తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ ప్రతిమాసింగ్ కు వినతి పత్రం అందజేశారు.
సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 202425 సంవత్సరంలో నిర్వహించిన సమ్మె కాలానికి 29 రోజులకు సంబంధించిన జీతాలను కూడా ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో TSUTF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే పద్మారావు, శ్రీనివాసరావు, కోశాధికారి అజయ్ కుమార్, కార్యదర్శులు నాగుల్ మీరా, శేఖర్, భీమ్లా నాయక్, నర్సింలు, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు, సిఆర్పిల జిల్లా అధ్యక్షులు గట్టయ్య, KGBV రాష్ట్ర నాయకులు సుహాసిని, పూర్ణేశ్వర్ ఉమా, పద్మ, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.




