13 May, 2026 | 9:58 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

మిల్లర్లు వరి ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలి

13-05-2026 08:49 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

చందుర్తి,(విజయక్రాంతి): రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ చందుర్తి మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కాసేపు ముచ్చటించి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలు, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

వరి ధాన్యం రైస్ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా తరలించడం వల్ల రవాణా వేగవంతం అవుతుందని రైతులు తెలిపారు... రైస్ మిల్లర్లో ధాన్యం దిగుబడి చేసే క్రమంలో ఆలస్యం చేయకుండా వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆ ప్రక్రియ సజావుగా సాగేలా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.