31 March, 2026 | 2:55 PM

Breaking News

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •  

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

04-10-2025 05:10 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని, అలాగే ఈనెల 8వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, హబ్సిగూడ, నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.