8 June, 2026 | 4:15 AM

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

08-06-2026 12:49 AM

నిర్మల్, జూన్ 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్ లో ఏకలవ్య ఫౌండేషన్ మరియు దివ్యాంగ శక్తి ఫౌండేషన్ లు సంయుక్తంగా నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 

నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు మరియు దివ్యాంగులై విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రాధిక మరియు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించబడుతున్నాయని, కష్టపడే తత్వం ఉంటే ఎక్కడ చదువుకున్న విజయం సాధించడం పెద్ద విషయం కాదని అందుకు మీరే ఉదాహరణ అని, జీవితంలో ఉత్తమ లక్ష్యాలను సాధించాలని దేశానికి సేవ చేయాలని పేర్కొన్నారు.

ఏకలవ్య ఫౌండేషన్ విద్యా రంగంలో అనేక రకమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ‘ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభ గల పిడుగులు‘ అని ప్రపంచానికి చాటుతోందని కొనియాడారు. పురస్కార గ్రహీతలైన విద్యార్థుల ప్రసంగాలు అందరిని ఆకట్టుకున్నాయి.   ఏకల ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రావు, దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ చైర్మన్ మహేష్, ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ దిగంబర్, ఎంసీ లింగన్న, ఎంఈఓలు పద్మ, సంధ్యారాణి, సదానంద్, నరేంధర్, శ్రీహరి, ఏకలవ్య బాధ్యులు ప్రశాంత్, రామ్మోహన్, శంకర్, ముత్యం తల్లిదండ్రులు పాల్గొన్నారు.