8 June, 2026 | 3:17 AM

ఇషా పారాలసిస్ సెంటర్ ప్రారంభం

08-06-2026 12:51 AM

నిర్మల్ జూన్ 7 (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇషా పారాలసిస్ సెంటర్ ను ఈ రోజు నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారాలసిస్ బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు, ఫిజియోథెరపీ మరియు పునరావాస సేవలు అందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోనే మెరుగైన చికిత్సా సౌకర్యాలు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం సెంటర్లోని సౌకర్యాలను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. రోగులకు అంకితభావంతో సేవలు అందించి, వారి ఆరోగ్య పునరుద్ధరణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కత్తి నరేందర్, గోపు గోపి,శనిగరాపు నరేష్, రాఘవేంద్ర చారి, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ ధర్మాజీ శ్రీనివాస్, నాయకులు ఆడప శ్రీకాంత్,స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు