24 February, 2026 | 8:07 PM

తొలగనున్న జవహర్ నగర్... అదనపు డంపింగ్ భారం

24-02-2026 06:29 PM

మినీ డంపింగ్ యార్డల కోసం ప్రభుత్వం వేట

జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్ నగర్ పాలిట శాపంగా పరిగణించింది. హైదరాబాద్ సిటీ నుండి రోజుకు దాదాపుగా 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు చేరుతుండగా... కొత్త ప్రాంతాల నుండి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఈ జవహర్ నగర్ ను ఊపిరి తీసుకోనివ్వడం లేదని జవహర్ నగర్ వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నరకం నుండి జవహర్ నగర్ వాసులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన దమ్మాయిగూడ, నాగారం, అహమ్మద్ గూడా, చీర్యాల్, తదితర ప్రాంతాల ప్రజలకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డ్ ల కోసం వేట మొదలు పెట్టింది.