27 August, 2026 | 10:22 PM

సెప్టెంబర్ 2వ ,3వ తేదీలలో మండల స్థాయి క్రీడా పోటీలు

27-08-2026 05:32 PM

నేరేడుచర్ల, ఆగస్టు 27(విజయ క్రాంతి):  సెప్టెంబర్ నెల 2 వ, 3వ తేదీలలో మండల పాఠశాల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని నేరేడుచర్ల ఎంఈఓ బాలునాయక్ పత్రిక ప్రకటన లో తెలిపారు. మండల స్థాయి స్కూల్ గేమ్స్ ను తేదీ 2 న బాలికలకు మరియు 3 వ తేదీన బాలురకు  ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులుకు 

పీఎం శ్రీ జి.ప.ఉ.పా నేరేడుచర్ల నందు నిర్వహించబడునని తెలిపారు. అండర్ 14 విభాగంలో పాల్గొనదలచిన వారు 1/1/2013 తర్వాత, అండర్ 17 విభాగంలో పాల్గొనదలచినవారు  1/1/2010 తర్వాత జన్మించివుండాలన్నారు.ఈ క్రీడలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇన్చార్జి D..ఏసుపాదం (పి.డి)

M. యాదగిరి (పి.డి)

B..శ్రీనివాస్ (పి.డి)

V. అశోక్ (పి.డి)  మరియు ఇతర పి.ఈ.టీ ,పీ,డీలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.