13 August, 2026 | 2:47 AM

మానసికస్థితి లేని వ్యక్తి ఆశ్రమానికి తరలింపు

13-08-2026 01:39 AM

ఉప్పల్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మ ల్లాపూర్ నుంచి వచ్చిన డయల్- 100 కాల్‌కు స్పందించిన నాచారం పోలీసులు మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తిని ఆశ్రమంలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే, 35 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రోడ్డుపై తిరుగుతూ కనిపించడంతో స్థానికులు డయల్- 100కు సమాచా రం అందించారు. కానిస్టేబుల్ చిరంజీవి ఘటనా స్థలానికి వెళ్లగా.. ఆ వ్యక్తి తన పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. సోష ల్ వర్కర్ రాజేష్ సహకారంతో సదరు వ్యక్తి ని అబ్దుల్లాపూర్మెట్లోని ఆలేటి ఆశ్రమంలో చేర్పించారు. ఆ వ్యక్తి సమాచారం ఎవరివద్దనైనా ఉంటే నాచారం పీఎస్‌ను సంప్ర దించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.