28 February, 2026 | 1:10 AM

మానసిక ఆరోగ్యంపై అవగాహన

27-02-2026 07:29 PM

మందమర్రి,(విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ఆదేశానుసారం మందమర్రిలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో మానసిక ఆరోగ్యంపై పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఒత్తిడికి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కార్యక్రమం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సిహెచ్ఓ కాకిరాల వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు మాధవి జై వంతరావు పాల్గొన్నారు.

ఆరోగ్య సిబ్బంది పద్మ లలిత సురేఖ ఉపాధ్యాయు. ఈ సందర్భంగా పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత మానసిక ఒత్తిడికి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పదవ తరగతి విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక ఒత్తిడికి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పైన అవగాహన కల్పించారు. బోర్డు పరీక్షలు రాసేవారు మానసిక ఒత్తిడికి గురికారాదని పటిష్టమైన మానసిక ఆరోగ్యానికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రోత్సాహం అవసరమనున్నారు. మానసిక ఒత్తిడికి కాకుండా దురాలవాట్లకు దూరం ఉండాలనీ కోరారు.

మానసిక ఒత్తిడికి గురి కాకుండా శరీరము మనసు పనితీరు మెరుగుపడేలా వ్యాయామానికి సమయం కేటాయించుకోవాలన్నారు. సమతుల ఆహారం తీసుకుంటూ రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలనీ, సుదీర్ఘ సమయాన్ని చదువు కేటాయిస్తే వ్యాయామానికి సమయం దొరకదన్నారు. ఫలితంగా శరీరము బద్ధకంగా మారుతుందనీ, ప్రతీ రోజూ వ్యాయామం తప్పనిసరనన్నారు. అదేవిధంగా చదువు పైన ఏకాగ్రతకు కేటాయించుకోవాలనీ, పాఠశాలల్లో రెసిడెన్షియల్ కళాశాలలో పిల్లలకు సమతుల్య ఆహారము వేడి వేడి ఆహార పదార్థాలు అందించడం వలన ఆరోగ్యంగా ఉంటారన్నారు.

పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ కావాలని మానసిక ఒత్తిడికి లొంగరాదన్నారు .వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులకు తగు చికిత్సలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ కరపత్రాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సురేఖ ఆరోగ్య సిబ్బంది పద్మ లలిత విద్యార్థులు పాల్గొన్నారు.