16 March, 2026 | 6:31 AM

విద్యార్థులకు మానసిక, శారీరక ఎదుగుదల చాలా ముఖ్యం

16-03-2026 12:44 AM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్, మార్చి 15 (విజయక్రాంతి): విద్యార్థులకు మానసిక, శారీరక ఎదుగుదల చాలా ముఖ్యమని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ప్రజా పాలన.... ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఆదివారం మల్టీ పర్పస్ గ్రౌండ్ లో ‘ హ్యాపీ సండే‘ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యోగా, జింబాబ్వే డ్యాన్స్, చిత్ర లేఖన పోటీలను ఏర్పాటు చేశారు. వంద మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గోని స్వచ్ భారత్ కాన్సెప్ట్ పై చిత్ర లేఖనం చేశారు.

అనంతరం ఈ పౌటీల్లో ప్రథమ , ద్వితీయ, తృతీయ విజేతలకు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపు నిచ్చారు. మానసిక ఎదుగుదలతో పాటు శారీరకంగా ఎదగాలని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ సాదించాలని, చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎంఏ అధికారి షాహిద్ మసూద్, అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ కుమార్, ఎంహెచ్ ఓ సుమన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, రమేష్, పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.