16 March, 2026 | 5:12 AM

ప్రమాదకర మూల మలుపులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టాలి

16-03-2026 12:47 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

సుల్తానాబాద్, మార్చ్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మార్కండేయ కాలనీ కి వెళ్లే రహదారి బిటి రోడ్డు నిర్మాణంలో మూల మలుపు లేకుండా ప్రమాదాలు నివారించేలా రోడ్డు నిర్మించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కండేయ కాలనీ లో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనుల ను స్వయంగా అధికారులు ప్రజాప్రతినిధుల తో కలిసి పరిశీలించారు. నాణ్యతతో రోడ్డు నిర్మా ణం చేపట్టాలని సూచించారు.

ప్రమాదకరంగా ఉన్న మూల మలుపు కౌన్సిలర్ చింతల రాజు ఎమ్మెల్యే కు వివరించి సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిను పాల ప్రకాష్ రావు, పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్ , ఊట్ల వరప్రసాద్, సాయిరి మహేందర్, దాన్నాయక్ దామోదర్ రావు పలువురు ఉన్నారు.