సభ్యత్వ నమోదు పార్టీ పటిష్టతకు కీలకం
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
కేసముద్రం, జూలై 1 (విజయక్రాంతి): పార్టీ ప్రతిష్టతకు సభ్యత్వ నమోదు అత్యంత కీలకమని, అదే సమయంలో ప్రస్తుతం ని ర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ పట్ల బీ ఆర్ ఎస్ శ్రే ణులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నా యక్ అన్నారు. కేసముద్రం మండల కేం ద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్, సభ్యత్వ నమోదు ప్రక్రియ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా కృషి చేయాలని కోరారు. పార్టీ మళ్లీ విజయం సాధించాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వయోజనులందరికీ ఓటుహక్కు కోల్పోకుండా బిఎల్‌ఏలు కృషి చేయాలన్నారు.
మహబూబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన SIR మరియు సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యత్వంలో చేర్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి BLAలు సమన్వయంతో పనిచేయాలి. SIR కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా కృషి చేయాలి. సభ్యత్వ నమోదు మరియు SIR కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేలా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలి.
బూత్ కన్వీనర్లు, సభ్యత్వ నమోదు ఇన్చార్జిలు గ్రామ సర్పంచ్లు, సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, వార్డు సభ్యులకు అండగా నిలిచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రవిచంద్ర రెడ్డి గారు,మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మాజీ ప్రెసిడెంట్లు నజీర్ గారు,వీరు నాయక్ గారు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, BLAలు, సభ్యత్వ నమోదు ఇన్చార్జిలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






