21 May, 2026 | 4:48 AM

రాబోయే అధికారం బీసీలదే

21-05-2026 01:19 AM

జూలైలో లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ

టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే అధికారం బీసీలదే అని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న ప్రారంభించారు.

వచ్చే నెల 25వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. మల్లన్న మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థా యి వరకు విస్తరించేలా పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సభ్యత్వ రుసుమును రూ.200గా నిర్ణయించినట్లు వెల్లడిం చారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు.

ప్రమాదంలో అంగవైకల్యం కలిగితే రూ.2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఇకపై పా ర్టీని గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు ప్రతి మండలం, గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. విద్యార్థి, కార్మిక, మహిళ, యువజన విభాగాలను బలోపేతం చేస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జూలై నెలలో లక్షలాది మంది ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సభ ఏర్పాటు బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్‌కు అప్పగించారు.

కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, మదన్మోహన చారి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నరసయ్య గౌడ్, ఉప కోశాధికారి కొక్కలకొండ మనోజ్, రాష్ట్ర కార్యదర్శులు పసల ప్రసన్న, మహమ్మద్ అఖిల్ పాషా, కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఆర్ భావన వెంకటేష్, శివ వీర్ రెడ్డి, మహి ళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ వనజ, ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు సంకురి శ్రీనివా స్, యూత్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, స్టూడెం ట్ వింగ్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మనోజ్ ఆకుల, మైనారిటీ ప్రెసిడెంట్ సల్మాన్, రాష్ట్ర సహాయ కార్య దర్శి బుర్ర మల్లేశం, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు.

విద్యార్థి పేరెంట్స్ కమిటీ పోస్టర్ ఆవిష్కరణ

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బందారం నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విద్యార్థి పేరెంట్స్ కమిటీ’ పోస్టర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మింగాలి నర్సింగ్ ముదిరాజ్, శేర్లింగంపల్లి కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు జాంగిర్, మజీద్ భాయ్, జలీల్ అర్జున్ పాల్గొన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మదినగూడ మహిళా అధ్యక్షురాలు నీలవేణి, సీనియర్ నాయకుడు కృష్ణ పటేల్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన్ ముదిరాజ్ పాల్గొన్నారు. పేద విద్యార్థులు చదువు ఆగిపోకుండా కృషి చేస్తామని మల్లన్న అన్నారు.