2 September, 2026 | 12:01 AM

గంగమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

29-06-2026 | 03:26pm

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలకేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగమ్మ జాతర,వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip and MLA Adi Srinivas) గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.గంగమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కూరవాలని పాడిపంటలతో ప్రజలు రైతులు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.

అనంతరం గంగపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ.గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఘనంగా జాతర, అన్నదానం కార్యక్రమం నిర్వహించిన్నట్లు తెలిపారు.అలాగే ఆలయం వద్ద విద్యుత్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కొరగానే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి దాదాపు 5లక్షల రూపాయలతో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు