17 July, 2026 | 1:13 AM

అనురాగ్‌లో మెగా రక్తదాన శిబిరం

17-07-2026 12:00 AM

250 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం

ఘట్ కేసర్, జూలై 16 (విజయక్రాంతి) : సమాజ సేవ పట్ల తమ నిబద్ధతను చాటుతూ అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్లు2, 3, 4, 6 సంయుక్తంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, జూబ్లీ హిల్స్ వైటల్ సహకారంతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ ప్రారంభించారు.

కార్యక్రమంలో డాక్టర్ సి. మల్లేష్, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, పి. చిన్న శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-2, టి. పురుషోత్తం, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-3, బి. సంతోష్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-4, బాలకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-6, ఎన్‌ఎస్‌ఎస్ ట్రైనర్లు, ఎన్సీసీ అధికారులు, అధ్యాపకులు  విద్యార్థులు పాల్గొన్నారు.ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 250 మందికి పైగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వాములయ్యారు.