3 August, 2026 | 9:28 PM

గుడిబండ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమావేశం

03-08-2026 08:31 PM

కోదాడ,(విజయక్రాంతి): గుడిబండ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా సోమవారం సంకల్ప సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరుకాగా, గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను ప్రజల భాగస్వామ్యంతో గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలు, అవసరాలను తెలియజేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.