26 August, 2026 | 10:07 AM

బూటు కాలితో తొక్కి.. మూత్ర విసర్జన చేసి..!

26-08-2026 09:10 AM

విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ లో యువకుడికి చిత్రహింసలు.

నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో ఘటన.

 నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పోలీస్ స్టేషన్(Thimmajipet Mandal Police Station) పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని విచారణ పేరుతో స్థానిక ఎస్సై బూటు కాలితో తొక్కి మీద మూత్ర విసర్జన చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితుడు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలోని ఓ యువతి పట్ల ఆ గ్రామానికి చెందిన యువకుడు మహేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇతరులతో ప్రస్తావించాడు.

ఈ కారణంతో ఆ యువకుడిపై  సదురు యువతి తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్సై శ్రీనివాసరావు ఆ యువకుడిని పిలిపించి స్టేషన్ పరిధిలోని రెస్ట్ రూమ్ గదిలో యువకుడిని మెడపై కాలితో తొక్కి పట్టి చిత్రహింసలకు గురిచేస్తూ మీద మూత్ర విసర్జన కూడా చేసినట్లు ఆ యువకుడు ఆరోపించాడు. దీనిపై డి.ఎస్.పి బుర్రి శ్రీనివాసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అశోక్ రెడ్డి విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పోలీసు అధికారుల నుండి మాత్రం విచారణ పేరుతో పిలిపించినట్లు మాత్రమే ధృవీకరించారు.