ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం
పర్యావరణ సమతుల్యత సాధించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.
అళ్ళపల్లి గ్రామ సర్పంచ్ వాసం సుష్మిత.
ఆళ్ళపల్లి, (విజయ క్రాంతి): పర్యావరణ సమతుల్యత సాధించాలంటే ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ వాసం సుస్మిత అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం ఏపీవో రఘునాథ్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ సుస్మిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వాసం సుష్మిత శ్రీకాంత్ మాట్లాడుతూ మొక్కల ప్రాముఖ్యత,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు.
మనం జీవిస్తున్నామంటే ముఖ్యంగా ప్రాణవాయువు అందించే వృక్షాల వల్లనేనని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కలు నాటి వాటి సంరక్షణ కూడా వారే చేసి భవిష్యత్ తరాలకు ప్రాణావాయువున అందించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. అనంతరం ఏపీవో రఘునాథ్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మొక్కల పెంపకం పట్ల కలిగే ఉపయోగాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రాయపాడు సర్పంచ్ ఊకే ఎర్రయ్య, ఉప సర్పంచ్ ఆరిఫ్,కార్యదర్శి ఉపేందర్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నులకతాటి శ్రీను, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇందు కుమార్, కార్యదర్శి లాలు,మండల నాయకులు పాయంసత్యనారాయణ, భరత్,రవి,సాయి,టిఏ శంకర్,తదితరులు పాల్గొన్నారు.






