26 August, 2026 | 10:06 AM

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

26-08-2026 09:05 AM

35 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 26 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భూపాలపల్లి సీసీస్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు టీఎస్ 02 యూసి 2103 నెంబర్ గల టాటా ఏసి పికప్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో సీఆర్ నగర్ కు చెందిన పావనపు రాజు ( 26 ) తండ్రి పేరు సమ్మయ్య, నీలుగొండ రమేష్ ( 21 ), తండ్రి పేరు తిరుపతి ఉన్నారు. నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓకు అప్పగించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు హెచ్చరించారు.