7 July, 2026 | 6:22 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

మోదీ సభను విజయవంతం చేయాలి

03-05-2026 01:22 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే  ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కోసం ఇల్లెందులోని పెన్షనర్ భవన్ లో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నరేంద్రమోడీ మూడవసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంగా రూ.8 వేల కోట్ల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయబోతున్నారు.

అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగసభ లో ప్రసంగిస్తారని అందుకు జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా నుండి సుమారు 3 వేల మంది పాల్గొనాలని,అందులో ఇల్లందు నియోజకవర్గం నుండి  కూడా పెద్దఎత్తున తరలి రావాలని అందుకు ప్రతి మండల అధ్యక్షులు కృషి చేయాలని కోరుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఈ బహిరంగ సభ నాంది అవుతుందని పేర్కొన్నారు.