12 June, 2026 | 10:30 PM

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు

12-06-2026 12:50 PM
  1. నేను అనుకోకుండా వివరాలు ఇచ్చాను
  2. ఎవరు వివరాలు లీక్ చేశారో నాకు తెలియదు
  3. నాకు కొంత మంది తో ప్రాణభయం ఉంది
  4. కొంతమంది నన్ను కోర్టుకు  రాకుండా అడ్డుకున్నారు

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కేసు నాంపల్లి కోర్టులో(Meenakshi Natarajan case) సంచలనం సృష్టించింది. వివరాలు లీక్ చేయడంపై కోర్టు ఆవరణలో బండారు శ్రీలత(Bandaru Srilatha) ఆవేదన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనుకోకుండా వివరాలు ఇచ్చానని, తన వివరాలు ఎవరు లీక్ చేశారో తెలియదని శ్రీలత తెలిపారు. తనను కోర్టుకు(Nampally Court) రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. తనకు కొంతమంది నుంచి ప్రాణభయం ఉందని తెలిపారు. తాను ప్రయాణిస్తున్న ఆటోను కొందరు వెంబడించారని వివరించారు. తనకు భద్రత కల్పించాలని అధికారులను కోరినట్లు శ్రీలత సూచించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని బండారు శ్రీలత పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ 

తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ విషయాన్ని నిన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, జస్టిస్‌లు పి.కె. మిశ్రా ఎ.ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించగా, ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దిన తర్వాత దీనిని శుక్రవారం విచారణకు జాబితా చేస్తామని ధర్మాసనం తెలిపింది.

నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న ఒక కేసు వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ, నటరాజన్ అభ్యర్థిత్వంపై బీజేపీ మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రాహుల్ కొఠారీ రిటర్నింగ్ అధికారి (RO)కి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఒక కోర్టులో పలువురు వ్యక్తులపై పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ ఫిర్యాదును కొఠారీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.