11 August, 2026 | 1:33 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం

11-08-2026 12:13 PM

ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్ జిల్లాలోని లోని బోర్డర్ వద్ద గులాబ్ వాటికా మార్కెట్‌లో మూడు అంతస్తుల హార్డ్‌వేర్ దుకాణం పైకప్పు కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ 'ఎఫ్' స్క్వాడ్‌కు చెందిన 3వ బృందం ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.  చిక్కుకున్నవారిలో ముగ్గురిని సహాయ సిబ్బంది బయటకు తీసి, అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించారు. 32 ఏళ్ల ముఖేష్ యాదవ్‌గా గుర్తించిన మూడవ వ్యక్తిని అపస్మారక స్థితిలో బయటకు తీసి ఢిల్లీలోని జీటీబీ (GTB) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.