11 August, 2026 | 11:58 AM

కొలంబియాలో భారీ భూకంపం

11-08-2026 11:05 AM

కొలంబియా : కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.  భూకంపం ధాటికి డజన్ల సంఖ్యలో భవనాలు శిథిలమయ్యాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకోగా, కనీసం 111 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. కొలంబియా రాజధాని బొగోటాలోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు.  బొగోటాకు 400 కిలోమీటర్ల దూరంలోని చోకోలో భూకంప కేంద్రం ఉందని, భూకంపం ధాటికి పెరీరా, క్విబ్డో, కాలి, మనిజాలెస్ నగరాలు ధ్వంసమైనట్లు అధికారలు పేర్కొన్నారు. కొలంబియా వ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలు దెబ్బతిన్నాయని, ఈ భూకంప ప్రకంపనల కారణంగా 87 మంది గాయపడ్డారని, సుమారు 1,600 భవనాలు దెబ్బతిన్నాయని, అందులో 61 భవనాలు పూర్తిగా కూలిపోయాయని కొలంబియా అధ్యక్షుడు అబెల్లార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు.

కొలంబియా దేశంలో సంభవించిన భూకంపం 21వ శతాబ్దంలో నమోదైన అత్యంత శక్తివంతమైనది. దీని తర్వాత అనేక అనంతర ప్రకంపనలు (aftershocks) సంభవించాయి. ఈ శక్తిమంతమైన భూకంపం తర్వాత 4.8, 2.8 తీవ్రతతో మరో రెండు ప్రకంపనలు వచ్చాయి. దీంతో మనిజాలెస్, క్విబ్డో, కార్టాగో, బ్యూనవెంచురా, పెరీరా, అర్మేనియాలో విమాన సర్వీలు నిలిచిపోయాయి.