30 June, 2026 | 8:42 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

వరంగల్‌లో హోమ్ హెల్త్‌కేర్ సేవలను విస్తరించిన మెడికవర్ హాస్పిటల్స్

18-11-2025 06:00 PM

వరంగల్/హన్మకొండ (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ తమ సమగ్ర హోం హెల్త్‌కేర్ సర్వీసులను మరింత ప్రజలకు చేరువ చేయడానికి రూపొందించిన కొత్త సృజనాత్మక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రియేటివ్‌లో కుటుంబం ఆధారంగా రూపొందించిన విజువల్ థీమ్ ఉండి, సౌకర్యం, భద్రత, నమ్మకమైన వైద్య సేవలను ప్రతిబింబిస్తుంది. ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలను అందించాలనే మెడికవర్ లక్ష్యాన్ని ఈ ప్రచారం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సేవల్లో శాంపిల్ కలెక్షన్, నర్సింగ్ కేర్, అటెండెంట్/కేర్‌టేకర్ సపోర్ట్, ఫిజియోథెరపీ, డాక్టర్ విజిట్, మెడిసిన్ డెలివరీ, టెలి కన్సల్టేషన్, పూర్తి హెల్త్ చెక్‌ప్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యంగా వయోవృద్ధులు, కదలికలు పరిమితమైన వారు, బిజీగా ఉండే కుటుంబాలు, ఇంట్లోనే భద్రంగా చికిత్స పొందదలచుకునే వారికి ఈ సేవలు ఎంతో సాయం చేస్తాయి. హాసిల్-ఫ్రీ మెడికల్ సపోర్ట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక ఫోన్ కాల్‌తోనే హాస్పిటల్-క్వాలిటీ సేవలు ఇంటి వద్ద అందించడమే మెడికవర్ హోం హెల్త్‌కేర్ ప్రత్యేకత అని ఈ క్రియేటివ్ తెలియజేస్తుంది. వరంగల్‌లో పేషెంట్-సెంట్రిక్ ఆరోగ్య సేవలలో మెడికవర్ ముందంజలో ఉన్నదనే సందేశాన్ని ప్రచారం బలపరుస్తుంది. సమాజానికి మరింత దగ్గరగా ఉండే విధంగా, అనుకూలత, సౌకర్యం, కరుణాతో కూడిన ఆరోగ్య సేవలను అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ తమ కట్టుబాటును ఈ క్యాంపెయిన్ పునరుద్ఘాటిస్తోంది.