16 June, 2026 | 6:03 PM

వర్షాకాలంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

16-06-2026 05:01 PM

ప్రసూతి కోసం  నిండు గర్భిణులను వారం రోజుల ముందే పీహెసీలకు తీసుకురావాలి

ఉట్నూర్,(విజయక్రాంతి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా  వైద్య సిబ్బందితో పాటు  ఆశా వర్కర్లు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  అదనపు అధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని  పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లకు  ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో వారి ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో  ప్రసూతికి సిద్ధంగా ఉన్న  నిండు గర్భిణులను  వారం రోజులు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకు రావలసిన బాధ్యత ఉందన్నారు. గిరిజన గ్రామాల్లో  భారీ వర్షాలు కురిస్తే వాగులు వంకలు పొంగిపొరడంతో  గిరిజనులు బయట ప్రపంచానికి రాలేకపోతారని, అలాంటి గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాలకు వర్షాకాలంలో 108 అంబులెన్స్ సైతం  వెళ్ళని పరిస్థితి ఉందని  వారికి వివరించారు. వైద్య సిబ్బంది తోపాటు ప్రతి ఆశ వర్కర్  అప్రమత్తంగా ఉండాలని  సూచనలు చేశారు. ఆయనతోపాటు  వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.