16 June, 2026 | 6:02 PM

విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండండి

16-06-2026 04:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వానాకాలం సీసన్ ప్రారంభమైన నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లాలోని కడెం ఖానాపూర్ నిర్మల్ మామడ మండలాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్ సరఫరా, పెండింగ్ సమస్యలు విద్యుత్ సిబ్బంది పనితీరు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ సుభాష్ జాదవ్, డివిజనల్ ఇంజనీర్ నాగరాజు సిబ్బంది ఉన్నారు.