calender_icon.png 18 February, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు

18-02-2026 12:46:28 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి):.క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (నమోదు, నియంత్రణ) చట్టం ప్రకారం, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో నిర్వహణలో ఉన్న శ్రీరామ్ ఆసుపత్రికి షోకాష్ నోటీస్ జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం తప్పనిసరిగా పొందవలసిన నమోదు లేకుండా నిర్వహణలో ఉన్నట్లు గుర్తించబడింది.

చట్టబద్ధమైన నమోదు, ప్రమాణాలు పాటించకుండా వైద్య సేవలు అందించడం చట్ట విరుద్ధమని, ఇది ప్రజల ఆరోగ్య భద్రతకు హానికరమని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆసుపత్రి యాజమాన్యానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్దిష్ట గడువులోగా వివరణ సమర్పించవలసిందిగా ఆదేశించారు. లేని పక్షంలో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ కేంద్రాలు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం నమోదు చేసుకుని నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ అనిల్, రాకేష్ పాల్గొన్నారు.