5 May, 2026 | 1:57 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

జేఈఈ ఫలితాల్లో మెరిసిన బ్రిలియంట్ విద్యార్థి

18-02-2026 12:47 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి17, (విజయక్రాంతి): ఇటీవలే ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో స్థానిక సారపాక బ్రిలియంట్ కాలేజ్ నుండి జాతీయస్థాయిలో 95.98 శాతంతో కె.జయంత్ రెడ్డి భద్రాచలం డివిజన్లో అగ్రగామిగా నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిబి జయంత్ రెడ్డిని, అధ్యాపకులను బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్‌ఆర్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎప్ సెట్ కోచింగ్ కూడా ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా బ్రిలియంట్ విద్యార్థులు టాప్ టెన్ కాలేజీలో మరియు యూనివర్సిటీలో సీట్లు సాధించారని తెలియజేశారు.ఎప్ సెట్ వ్రాయబోవు విద్యార్థులు ముందుగా తమ అప్లికేషన్ పూర్తిచేసుకుని కోచింగ్ తీసుకోవడానికి ఈ నెంబర్లను 9705137128, 9866283566 సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల డైరెక్టర్ కార్తికేయ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.