30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

పోలీసులకు భరోసా.. సేవలో మెడికల్ ఫార్మసీ ముందడుగు

16-04-2026 12:00 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 15: హుస్నాబాద్ పట్టణంలోని హుస్నాబాద్ మెడికల్ ఫార్మసీ తన ప్రారంభానికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతను చాటుతూ పోలీస్ శాఖకు 15 చెక్పోస్ట్ బారికేడ్లను అందజేసింది. ప్రజల భద్రతలో భాగస్వామ్యం అవుతూ ఈ సహాయం చేయడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం మెడికల్ ఫార్మసీ యాజమాన్యాన్ని అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. పోలీస్ శాఖకు ఈ బారికేడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఫార్మసీ యజమానులు ఆంజనేయులు గౌడ్, వేణు, తిరుపతి, మహేంద్ర, నరేష్ హాజరయ్యారు. సమాజ సేవలో భాగంగా సంస్థలు ముందుకు రావడం అభినందనీయం అని స్థానికులు ప్రశంసించారు.