11 March, 2026 | 9:03 AM

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

09-03-2026 01:47 AM

కలెక్టర్ రాజర్షి షా

రిమ్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాల ప్రారంభం: ఎంపీ నగేష్

ఆదిలాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండి యా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, (CSR) నిధులతో రిమ్స్ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్యం, శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలను కల్పించినట్లు ఎంపీ గోడం నగేష్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నీ పురస్కరించుకొని జిల్లాలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆదివారం రిమ్స్ ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సన్ చారిటబుల్ ట్రస్ట్ ల సహకారంతో జిల్లాలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష లతో కలిసి మ్యాచ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముం దుగా రిమ్స్‌లో బేబీ ఫీడింగ్ రూమ్ (తల్లి పాల గది) ని, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ, కలెక్టర్‌లు ప్రారంభించారు.

అనంతరం క్యాన్స ర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందేశారు. అనంతరం పలువురు మహిళలు రిమ్స్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయగా ఎంపీ, కలెక్టర్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ , కలెక్టర్ లు మాట్లాడు తూ... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ముందస్తు నిర్ధారణ ద్వారా ప్రాణాపాయం నుండి తప్పిం చుకోవచ్చని సూచించారు.

కార్పొరేట్ సంస్థ లు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాల ను చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా జిల్లాలోని మహిళలకు ఉచితంగా నాణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయన్నారు. 9 నుండి 15 ఏళ్ల లోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా ముమ్మ రంగా చేపడుతున్నట్లు వివరించారు.

స్థానిక రిమ్స్, బోథ్, ఉట్నూర్ ఆసుపత్రుల్లో ప్రారంభించి, ప్రస్తుతనికి అందుబాటులో ఉన్న 1,700 వ్యాక్సిన్‌లు పూర్తిచేయడంతో పాటు అవసరమైన వ్యాక్సినేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చి 99 రోజుల ప్రజాపాల న-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. తల్లుల సౌకర్యార్థం కోల్ ఇండియా నిధులతో 25 బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేసినట్లు, తల్లులు తమ బిడ్డలకు సురక్షితమైన వాతావరణంలో పాలిచ్చేలా ఈ గదులు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

అదేవిధంగా, మహిళ ల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిధులతో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన అత్యాధునిక వైద్య పరి కరాలను అందజేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున, ముందుస్తుగా వ్యాధిని గుర్తించి మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, జిల్లా ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల తాము ప్రత్యే క శ్రద్ధ వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా వార్డ్ కౌన్సిలర్ శ్వేత, మహిళ వైద్యులు, సిబ్బం ది నీ కలెక్టర్, ఎంపీ శాలువాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, వార్డ్ కౌన్సిలర్ శ్వేత, సన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అశోక్ ముస్తాపూరే, ఇండియా ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు,వైద్యులు పాల్గొన్నారు.