10 May, 2026 | 2:48 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

20-02-2026 07:43 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే  వార్డు పరిధిలోని ప్రతి ఇంటి ఆడ బిడ్డ వివాహానికి రూ.10,016 లను కానుకగా ఇస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ నగర్ కు చెందిన కీ.శే సుంకరి నరసింహ - పద్మ ల ప్రథమ పుత్రిక రాజేశ్వరి వివాహానికి కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, యువశక్తి యువజన సంఘం సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.10,016లను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువశక్తి యువజన సంఘం అధ్యక్షుడు ఐలపురం నరేష్, సంఘ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.