దోసపాడు నుంచి మంచినీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు
ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
సూర్యపేట, ఆగస్టు 12 (విజయక్రాంతి): పెన్ పహాడ్ మండలందోసపాడు నుండి సూర్యాపేటకు మంచినీటి సరఫరా పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదిలు అన్నారు.
బుధవారం 40 వ వార్డులో 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నాలుగు కల్వర్టుల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో మంచినీటి సరఫరా మెరుగుపరచడానికి చర్యలు చేపట్టామన్నారు. మిషన్ భగీర ద్వారా వచ్చే నీటి సరఫరా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అదేవిధంగా పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయవలసిందిగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇటీవల నాగార్జునసాగ ర్ వరుణ యాగం సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశామన్నారు. 60 ఫీట్ల రోడ్ అండర్ పాస్ సమస్య పరిష్కారానికి హైవే అధికారులతో మాట్లాడుతున్నామన్నారు.
పట్టణంలో అన్ని వా ర్డుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కు మ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు కొణతం రాజేష్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, నాగుల వాసు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, తంగెళ్ల క రుణాకర్ రెడ్డి , నరేందర్ నాయుడు, ఆలేటి మాణిక్యం,మద్దెబోయిన శ్రీనివాస్, నరేష్ పిల్లై ,వం శి, వెంకన్న, సంజయ్, వార్డు జవాను శ్రవణ్, వార్డు ఆఫీసరు సత్య తదితరులు పాల్గొన్నారు.






