2 May, 2026 | 12:09 AM

ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

01-05-2026 10:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేసవికాలం త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అందిస్తున్న త్రాగునీటి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ప్రజలకు త్రాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురైతే, అధికారులు వెంటనే స్పందించి, త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కడైనా తాగునీటి సరఫరా పైపులు లీకేజీలు, మరమ్మత్తులు ఉంటే రిపేర్లు చేపట్టాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాలలో త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, డిపిఓ శ్రీనివాస్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.