18 May, 2026 | 5:36 PM

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

18-05-2026 04:39 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ నాయకులు రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాముల నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కొండ్ర రాజేశ్వర్, కో-కన్వీనర్ ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాపర్తి అశోక్, ఎరుబోతుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.