సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్
05-05-2026 01:51 AM
ముకరంపుర, మే 4 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా సోమవారం రోజు 40 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ , స్థానిక కార్పోరేటర్ నలువాల పుష్పలత రవీంధర్ తో కలిసి 10 లక్షలతో నిధులతో సీసీ రోడ్డు, అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశారు.
అనంతరం కాలనీలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలను స్థానిక ప్రజలు మేయర్ దృష్టికి తేవడంతో వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు. త్వరలోనే నగరపాలక సంస్థ పరిదిలోని అన్ని డివిజన్లలో 50 కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






