5 May, 2026 | 5:28 AM

ఎప్‌సెట్‌కు 93.35% హాజరు

05-05-2026 01:50 AM

తొలి రోజు పరీక్ష ప్రశాంతం

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సోమవారం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రెండు సెషన్‌లలో పరీక్షలు జరిగాయన్నారు. ఉదయం సెషన్‌కు 30,333 మంది విద్యార్థుల్లో 28,046 (92.46 శాతం) మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌కు 30,253 మంది విద్యార్థుల్లో 28,241 (93.35 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు. 

పరీక్షల సరళిని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, క్యాదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి పలు సెంటర్లలో పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జోన్‌లో అత్యధికంగా 98.0 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం కూడా ఎప్‌సెట్ పరీక్ష జరగనుంది.