22 June, 2026 | 3:20 AM

పార్టీ భవిష్యత్తు నిర్మాణానికి యువతే కీలకం

22-06-2026 01:56 AM

నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పాయం ఘన సన్మానం

బూర్గంపాడు, జూన్ 21 (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా నియమితులైన ఎడమకంటి సుధాకర్ రెడ్డిని ఆదివారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువతే వెన్నెముక. సుధాకర్ రెడ్డి నియామకంతో నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్కు మరింత బలం చేకూరిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత సంక్షేమం, ఉపాధి కల్పనకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేయాలి.

పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను యువతలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత అండగా నిలవాలి‘ అని సుధాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, యువజన నాయకులు భజన ప్రసాద్ కుమార్, ఇంగువ రమేష్ పాల్గొన్నారు.