1 May, 2026 | 9:35 PM

ఘనంగా మేడే వేడుకలు

01-05-2026 08:06 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల మండల వ్యాప్తంగా ఊరూరా వాడవాడలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీలు, వాటి అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. అన్ని గ్రామాలలో పార్టీ జెండా దిమ్మెలను అలంకరణ చేసి పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలల్లో ఆయా పార్టీల జిల్లా, మండల నాయకులు పాల్గొని మాట్లాడారు.