7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలి

01-05-2026 03:03 PM

బోత్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మే డే ఒక వంద 41వ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు బి గోవర్ధన్ మాట్లాడుతూ ఎర్రజెండా నీడన ఎంతోమంది కార్మికులు ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించారని వారి నెత్తురుతో తడిసిన ఎర్రజెండ నే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని వాటిని ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మున్సిఫ్ అజయ్ హమాలి యూనియన్ నాయకులు ఆశన్న ప్రసాద్ బాబు పాల్గొన్నారు. సోనాల మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కొండమడుగు శంకర్ పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఆశన్న చిన్నయ్య లక్ష్మణ్ సాయి అశోక్ భీమ్రావు పాటిల్ బోరే రవీందర్ లతోపాటు హమాలీ యూనియన్ ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు