11న ‘శపథ్’ భారీ అవగాహన ర్యాలీ
శపథ్ అధ్యక్షులు రామ్ నివాస్ బన్సల్
ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత యువ భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ‘శపథ్ మా లక్ష్యం, మా బాధ్యత’ ఆధ్వర్యంలో ఈ నెల 11న హైదరాబాద్లో భారీ మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అగర్వాల్ శిక్షా సమితి, ఈగిల్ ఫోర్స్ యాంటీ-డ్రగ్ టీమ్ సహకారం తో, లయన్స్ క్లబ్ ఆఫ్ సమర్పణ్ మద్దతుతో ర్యాలీ చేపట్టనున్నట్లు శపథ్ అధ్యక్షుడు రామ్ నివాస్ బన్సల్ తెలిపారు.
ఈ మేరకు శనివా రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ర్యాలీ కి సం బందించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూచార్మినార్ వ ద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ గుల్జార్ హౌస్, మచ్లికామన్, మీర్ ఆ లం మండి కమాన్ మీదుగా చార్కమాన్లోని అగర్వాల్ గరల్స్ హైస్కూల్ వరకు సాగనుం ది.
సుమారు 9 పాఠశాలలకు చెందిన వె య్యికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, త ల్లిదండ్రులు, స్వచ్ఛంద కార్యకర్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తె లిపారు.ఈ కార్యక్రమంలో శపథ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రి, మహావీర్ పిట్టి, సునీల్ కుమార్ అగర్వాల్, డా. వందన అగర్వాల్, అనిల్ సింగ్, కన్హయ్య గాడియా, విశాల్ కేడి యా, జితేంద్ర కుమార్ అగర్వాల్, సుశీల్ అ గర్వాల్, శిశిర్ కేడియా, దివ్య అగర్వాల్, సీనియర్ అడ్వకేట్ ప్రతాప్ నారాయణ్ సంఘి, రాజీవ్ అగర్వాల్,పాల్గొన్నారు.






