calender_icon.png 9 February, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే విజ్జన్న ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ

09-02-2026 03:32:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో చివరి రోజు ప్రచారం ను  పురస్కరించుకొని సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసల ఆరెపల్లి నుండి దాదాపు 2,000 ద్విచక్ర వాహనాలతో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో  పట్టణంలోని పలు వాడల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం తెలంగాణ చౌరస్తా లో సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తన రెండేళ్ల పదవి కాలంలో ఇప్పటివరకు పెద్దపల్లి నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని,  మరో 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 15 గెలిచేలా ప్రజలు ఆశీర్వదించాలని, దీంతో మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు, నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి లక్ష్యంగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు, ఈ ర్యాలీ లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ తోపాటు 15 వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.