భద్రతా బలగాలకు బాడీ కెమెరాలు
లాఠీచార్జ్ పై సీఆర్పీఎఫ్ ఐజీ అసహనం
నీట్ ఆందోళనల వేళ కేంద్ర బలగాలు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: నీట్ ఆందోళనల(NEET protests) దృష్ట్యా కేంద్ర బలగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నిరసనకారులపై పెల్లెట్ గన్స్(Pellet guns) ప్రయోగించారనే ప్రచారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టెల్ అటాక్ గన్స్, యాంటీ రిమోట్ గన్స్, విద్యుత్ షాక్ ఆయుధాలు, విద్యుత్ కవచాలు వాడవద్దని ఆదేశించారు. సీఆర్పీఎఫ్ ఆర్ఏఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. నిరసన వేళ రద్దీ కట్టడిలో లోపాలు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. క్రమశిక్షణ, జావాబుదారీతనం పెంచే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి ఆపరేషన్ లో సిబ్బంది బాడీ కెమెరాలు వాడాలని సూచించారు. బారికేడ్లకు అవతల ఉన్నవారిపైనా లాఠీచార్జ్ పై సీఆర్ పీఎఫ్ ఐజీ అసహనం వ్యక్తం చేశారు.






