30 May, 2026 | 2:06 AM

గురుకుల సీట్లకు భారీ డిమాండ్

30-05-2026 12:28 AM
  1. మొదటి విడతలోనే 18,401 సీట్లు భర్తీ
  2. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య 
  3. ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలలో
  4. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎ డ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) సొసైటీ ఆధ్వర్యంలో 2026-- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇం టర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 45,357 దరఖాస్తులు వ చ్చాయని, అందులో ఎంపీసీకి 21,447, బై పీసీకి 17,400, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులన్నింటికి కలిపి 6,510 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉండగా, ప్రవేశ పరీక్షకు 39,052 (86.09 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొదటి విడతలో మొ త్తం 18,401 సీట్లు భర్తీ కావడం గురుకులాలపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమ న్నారు. ఇంకా 1,339 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. 

జూన్ 7లోపు కాలేజీల్లో చేరాలి

మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో జూన్ 7లోపు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని మంత్రి అడ్లూరి తెలిపారు. కా గా జేఈఈ మెయిన్ 2026లో 337 మంది అర్హత సాధించడం గర్వకారణమన్నారు. సీ ఈసీ కళాశాలల్లో ఐఐటీ, జేఈఈ, నీట్, ఎన్‌డీఏ, క్లాట్ వంటి జాతీయ పరీక్షల్లో కార్పోరే ట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులను మొదటి రోజే కళాశాలలకు పంపించాలని మంత్రి కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిం చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గురుకుల విద్యాసంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక చర్య లు తీసుకుంటోందని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌డీ విజయ్ కుమార్, సొసైటీ కార్యదర్శి  కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ సక్రు నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ మధు నాయక్, డిప్యూటీ సెక్రటరీ సహజ, సూపరింటెండెంట్ మృణాళిని, డీపీఓ  శ్రీకాంత్ పాల్గొన్నారు.