18 July, 2026 | 4:20 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

18-07-2026 04:20 PM

ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర శనివారం సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టీజీఎంఐడీసీ అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్ పనులు ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు కూడా నిర్మాణ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో టీజీఎంఐడీసీ డీఈ, ఏఈ, నిర్మాణ కాంట్రాక్టర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి హర్షవర్ధన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.