21 August, 2026 | 6:13 PM

నేరేడుచర్లలో ఘనంగా సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రతం

21-08-2026 05:13 PM

నేరేడుచర్ల,ఆగష్టు 21(విజయక్రాంతి): శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం మహిళలు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్ రామాలయంలో సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని సాంప్రదాయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదచనాలు తీసుకొని అష్ట ఐశ్వర్యాలతో , భోగ భాగ్యాలతో సిరిసంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు పూజా కార్యక్రమంలో కోరుకున్నారు. ఆలయ పూజారి సంతోష్, మహిళలకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్  తాళ్ల లావణ్య, పద్మ, మౌనిక, మనమ్మ, అరుణ, చంద్రకళ, మాధవి, సుగుతా, నాగలక్ష్మి, పద్మ, సావిత్రి, నిర్మల, లక్ష్మమ్మ, రమా తదితర మహిళలు పాల్గొన్నారు.