21 August, 2026 | 7:03 PM

కాంగ్రెస్‌లో చేరింది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాదు

21-08-2026 05:48 PM

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని గోయేగావ్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై వాంకిడి మండల బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వాంకిడి మాజీ జెడ్పిటిసి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తులకు బీఆర్‌ఎస్‌ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా పేర్కొంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని, ఆయనతో పాటు మండల బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఖండించారు. బీఆర్‌ఎస్‌కు సంబంధం లేని వ్యక్తులను పార్టీ కార్యకర్తలుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలు గమనించాలని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు.